ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు జనవరి 7 నుంచి ప్రారంభం కానున్నాయి.
అకడమిక్ క్యాలెండర్‌కు స్వల్ప మార్పు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు జనవరి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. అధికారవర్గాల సమాచారం ప్రకారం 2016–17 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌కు స్వల్ప మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం 2017 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ఇటీవల అధికారికంగా ప్రకటించడంతో దీనిపై పాఠశాల విద్యాశాఖ అకడమిక్ వింగ్ కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాలు వివరించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం జనవరి 7 నుంచి 15 వరకు సెలవులు ప్రకటించే అవకాశముందని విద్యాశాఖవర్గాలు తెలిపాయి.