ఇచ్చోడ(ఆదిలాబాద్ జిల్లా): ఇచ్చోడ మండల కేంద్రంలో తుపాకీతో సంచరిస్తున్న పడ్వాల్ గోపాల్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇచ్చోడ పోలీసుస్టేషన్‌లో బోథ్ సీఐ నాగేంద్రచారి, ఎస్సై శంకర్‌నాయక్ వివరాలు వెల్లడించారు. బజార్‌హత్నూర్ మండలం గొకండ పంచాయతీ పరిధి దాబాడి గ్రామానికి చెందిన పడ్వాల్ గోపాల్ మధ్యప్రదేశ్‌లోని బోపాల్ కు చెందిన గంగారాం వద్ద రూ.15 వేలకు తుపాకి కొనుగోలు చేశాడు.
శనివారం సాయంత్రం తుపాకితో గోపాల్ తన స్వగ్రామమైన దాబాడికి ఆటోలో వెళ్తున్నాడు. ఇచ్చోడ ఎస్సై శంకర్‌నాయక్ మండలంలోని అడేగామ కే వద్ద శనివారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తూ వాహనాలు తనిఖీ చేశారు. ఆటోలో గోపాల్ వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా తుపాకి లభ్యమైంది. నిందుతుడిని అదుపులోకి తీసుకుని తుపాకి స్వాధీనం చేసుకున్నామని, రిమాండ్‌కు తరలించామని సీఐ, ఎస్సై వివరించారు.
తుపాకీతో సంచరిస్తున్న వ్యక్తి అరెస్ట్
Published Mon, May 9 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM
Advertisement
Advertisement