
తుపాకీతో లోపలకు వెళ్లిన వ్యక్తిని గుర్తించలేకపోయారు!
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపలకు తుపాకీతో వెళ్లిన వ్యక్తిని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేకపోయింది. పోలీసుల డెకాయిట్ ఆపరేషన్లో ఆ వ్యక్తి దొరికాడు.
ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.