
కర్నూలులో పిస్టల్ కలకలం
పిస్టల్ చూపించి ఓ వ్యక్తిని బెదిరించిన సంఘటన కర్నూలు జిల్లా కల్లూరు వద్ద చోటుచేసుకుంది.
కర్నూలు : పిస్టల్ చూపించి ఓ వ్యక్తిని బెదిరించిన సంఘటన కర్నూలు జిల్లా కల్లూరు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. కర్నూలుకు చెందిన ఇసాక్ అనే బంగారు వ్యాపారి, ఓ కొనుగోలు దారుడితో వ్యాపార లావాదేవీల్లో తేడా రావడంతో పిస్టల్‌తో బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పిస్టల్‌కు లెసైన్స్ లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇతనికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇసాక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.