టెక్కలి మండల కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు.
శ్రీకాకుళం: టెక్కలి మండల కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. తంగుడు స్వప్న అనే మహిళ మెడలో నుంచి తాళిని లాక్కుని వెళ్తుండగా.. ఆమె ప్రతిఘటించడంతో అతడు కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఆమె కాలుకి గాయమైంది. దుండుగుడు ఆమెను పిస్టల్‌తో బెదిరించి పుస్తెలతాడు తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
(టెక్కలి)