
సాక్షి, నిర్మల్ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకర్‌గౌడ్ అనే వ్యక్తి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఆదివారం కార్యాలయంలో తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో పొరపాటున ట్రిగ్గర్ తగిలి మిస్‌ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ శంకర్‌గౌడ్ చాతి భాగం నుంచి బయటకు దూసుకెళ్లింది. గాయపడిన శంకర్ గౌడ్‌ను నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment