తుపాకీతో బెదిరించి బంగారం చోరీ | 150 gram gold robbery from 2 women in rangareddy district | Sakshi
Sakshi News home page

తుపాకీతో బెదిరించి బంగారం చోరీ

Published Fri, May 15 2015 8:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

తుపాకీతో బెదిరించి బంగారం చోరీ - Sakshi

తుపాకీతో బెదిరించి బంగారం చోరీ

రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలో గుర్తుతెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు.

మేడ్చల్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలో గుర్తుతెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ మండలం పూడూరు చౌరస్తా వద్ద ఇద్దరు మహిళలను గుర్తుతెలియని దుండగులు వెంబడించారు. తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆ మహిళలను బెదిరించి వారి నుంచి 15 తులాల బంగారం దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement