కీవ్: యుద్ధ సమాచారాన్ని పాశ్చాత్య దేశాలకు లీక్ చేశారనే ఆరోపణలపై ఏకంగా 150 మందికి పైగా సైనిక, నిఘా ఉన్నతాధికారులను రష్యా అదుపులోకి తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన గంటల వ్యవధిలోనే ఆ దేశ యుద్ధ ప్రణాళికను ఇంగ్లండ్ ట్విట్టర్‌లో పెట్టింది. సేనలు ఏయే మార్గాల్లో వెళ్తున్నదీ ఎప్పటికప్పుడు కచ్చితంగా అంచనా వేస్తూ వచ్చింది. ఈ పరిణామాలపై పుతిన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారని సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ విదేశీ విభాగాధిపతి సెర్గీ బెసెడాతో పాటు 150 మందిని అరెస్టు చేశారు.
వీరందరినీ మాస్కోలో స్టాలిన్ హయాంనాటి అత్యంత కట్టుదిట్టమైన లెఫొర్టోవ్ జైలుకు తరలించారు. మొత్తం వ్యవహారంపై మిలిటరీ కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం ద్వారా దర్యాప్తుకు పుతిన్ ఆదేశించారు. వాస్తవ పరిస్థితిని చెప్పకపోగా, రష్యా సైన్యాన్ని స్వాగతించేందుకు ఉక్రేనియన్లు సిద్ధంగా ఉన్నారంటూ తప్పుదోవ పట్టించినందుకే వారిని అదుపులోకి తీసుకున్నారని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. యుద్ధంలో రష్యా ఘోరంగా దెబ్బ తినడానికి నిఘా విభాగం వైఫల్యం, లీకేజీలే కారణమని పుతిన్ భావిస్తున్నట్టు సమాచారం.
(చదవండి: యుద్ధం కొనసాగుతుంది.. స్పష్టం చేసిన పుతిన్)
Comments
Please login to add a commentAdd a comment