intellegence department
-
నా భద్రతకు ముప్పు ఉంది : ఎమ్మెల్యే రాజాసింగ్
-
ఇంటెలిజెన్స్ ఐజీకి రాజాసింగ్ లేఖ.. ‘నా లైఫ్ డేంజర్లో ఉంది’
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్.. ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని లేఖలో ఐజీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న తన వాహనం తరచూ మొరాయిస్తోందని లేఖలో చెప్పుకొచ్చారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి దారుణం అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. నా భద్రతకు ముప్పు ఉంది. కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడానికి కేసీఆర్ అనుమతి లేదా?. లేక అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నలు సంధించారు. టెర్రరిస్టులు, యాంటీ సోషల్ యాక్టీవిస్ట్‌లు తనపై దాడి చేసే అవకాశం కల్పిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. తన లైఫ్ డేంజర్లో ఉందని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందన్నారు. వెంటనే కొత్త వాహనాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. అంతుకుముందు తన వాహనంలో వెళ్తుండగా కారు మొరాయించడంతో రాజాసింగ్ వేరే వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. కాగా, పీడీ యాక్ట్‌లో భాగంగా రాజాసింగ్ జైలుకు వెళ్లి.. ఇటీవలే కోర్టు ఆదేశాల అనంతరం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
రష్యా ప్లాన్లన్నీ లీక్.. పుతిన్ సీరియస్.. ఆ 150 మంది పరిస్థితేంటి?
కీవ్: యుద్ధ సమాచారాన్ని పాశ్చాత్య దేశాలకు లీక్ చేశారనే ఆరోపణలపై ఏకంగా 150 మందికి పైగా సైనిక, నిఘా ఉన్నతాధికారులను రష్యా అదుపులోకి తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన గంటల వ్యవధిలోనే ఆ దేశ యుద్ధ ప్రణాళికను ఇంగ్లండ్ ట్విట్టర్లో పెట్టింది. సేనలు ఏయే మార్గాల్లో వెళ్తున్నదీ ఎప్పటికప్పుడు కచ్చితంగా అంచనా వేస్తూ వచ్చింది. ఈ పరిణామాలపై పుతిన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారని సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ విదేశీ విభాగాధిపతి సెర్గీ బెసెడాతో పాటు 150 మందిని అరెస్టు చేశారు. వీరందరినీ మాస్కోలో స్టాలిన్ హయాంనాటి అత్యంత కట్టుదిట్టమైన లెఫొర్టోవ్ జైలుకు తరలించారు. మొత్తం వ్యవహారంపై మిలిటరీ కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం ద్వారా దర్యాప్తుకు పుతిన్ ఆదేశించారు. వాస్తవ పరిస్థితిని చెప్పకపోగా, రష్యా సైన్యాన్ని స్వాగతించేందుకు ఉక్రేనియన్లు సిద్ధంగా ఉన్నారంటూ తప్పుదోవ పట్టించినందుకే వారిని అదుపులోకి తీసుకున్నారని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. యుద్ధంలో రష్యా ఘోరంగా దెబ్బ తినడానికి నిఘా విభాగం వైఫల్యం, లీకేజీలే కారణమని పుతిన్ భావిస్తున్నట్టు సమాచారం. (చదవండి: యుద్ధం కొనసాగుతుంది.. స్పష్టం చేసిన పుతిన్) -
విధులతో పాటు ఆరోగ్యమూ ముఖ్యం: ఐజీ శివధర్‌రెడ్డి
పంజగుట్ట: నిత్యం ఒత్తిడితో పనిచేసే పోలీసులు విధులతో పాటు వారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ తెలంగాణ రాష్ట్ర ఐజీ శివధర్‌రెడ్డి అన్నారు. ఆహారం, నిద్ర విషయంలో వేళలు పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యు) కార్యాలయంలో సాగర్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, ఐఎస్‌డబ్ల్యు సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 400 మంది వైద్యపరీక్షలు చేయించుకున్నారు. శివధర్‌రెడ్డి, ఐఎస్‌డబ్ల్యు ఐజీ మహేష్ భగవత్‌లు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నిమ్స్ వైద్యులు, సరోజినీదేవి కంటి ఆసుపత్రి వైద్యులు పర్యవేక్షించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగ ప్రొఫెసర్ జ్యోత్స్న, డాక్టర్లు కాంచన, లక్ష్మి, సందీప్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.