ఇళయరాజా చేతుల మీదుగా రుద్రమదేవి ట్రైలర్ | rudramadevi trailer released | Sakshi
Sakshi News home page

ఇళయరాజా చేతుల మీదుగా రుద్రమదేవి ట్రైలర్

Published Mon, Jun 15 2015 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

ఇళయరాజా చేతుల మీదుగా రుద్రమదేవి ట్రైలర్

ఇళయరాజా చేతుల మీదుగా రుద్రమదేవి ట్రైలర్

అత్యంత భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో రుద్రమదేవి ఒకటి. చారిత్రక కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో

 అత్యంత భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో రుద్రమదేవి ఒకటి. చారిత్రక కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో కాకతీయ సామ్రాజ్యపు పట్టపురాణి రాణి రుద్రమదేవిగా వీరోచిత పాత్రలో నటి అనుష్క నటించారు. ఇతర ప్రముఖ పాత్రల్లో అల్లుఅర్జున్, రాణా, నిత్యామీనన్, క్యాథరిన్ ట్రెసా, సుమన్, విజయకుమార్ నటించిన ఈ చిత్రానికి సృష్టికర్త గుణశేఖర్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళనాడు హక్కులను శ్రీ తేనాండాల్ ఫిలింస్ సంస్థ పొందింది.
 
 సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి గీత రచయిత పా.విజయ్ సంభాషణ రాయడం విశేషం. అజయ్ విన్సెంట్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం స్టీరియో ఫోనిక్‌తో పాటు 3డీ ఫార్మెట్‌లో రూపొందిన తొలి భారతీయ చిత్రం కావడం మరో విశేషం. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలో నిరాడంబరంగా నిర్వహించారు. చిత్ర ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఇళయరాజా ఆవిష్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement