
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!
నిత్యామీనన్ కు ఒకే సమయంలో రెండు సువర్ణావకాశాలు. ఒకటేమో మణిరత్నం సినిమాలో ఆఫర్. మరొకటి - త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీకి జోడీగా నటించే అవకాశం. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి
నిత్యామీనన్ కు ఒకే సమయంలో రెండు సువర్ణావకాశాలు. ఒకటేమో మణిరత్నం సినిమాలో ఆఫర్. మరొకటి - త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీకి జోడీగా నటించే అవకాశం. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్క్వార్ సల్మాన్ హీరోగా మణిరత్నం భారీ ఎత్తున ఓ సినిమా చేస్తున్నారు. అలియా భట్‌లాంటి పాపులర్ బాలీవుడ్ కథానాయికలను అనుకుని, ఫైనల్‌గా నిత్యామీనన్‌ను ఎంపిక చేసుకున్నారు మణిరత్నం. త్రివిక్రమ్ సినిమాకూ అలాంటి పరిస్థితే. ఇందులో బన్నీ సరసన ముగ్గురు కథానాయికలుంటారు.
సమంత, అదాశర్మను ఇప్పటికే ఎంపిక చేశారు. మరో నాయికగా ప్రణీత పేరు బాగా ప్రచారంలోకొచ్చింది. ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా ప్రణీత స్థానంలో నిత్యామీనన్ వచ్చి చేరారు. బన్నీతో ఆమెకిదే తొలి కాంబినేషన్. మలయాళ అమ్మాయి అయినా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడే నిత్యా, త్రివిక్రమ్ మార్కు సంభాషణలను పలకడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్‌లో నిత్యా ఎంటరవుతారని సమాచారం.