
నిత్యామీనన్
ఈ తరం హీరోయిన్లు ట్రెండ్ ఫాలో అవ్వడంలేదు.
ఈ తరం హీరోయిన్లు ట్రెండ్ ఫాలో అవ్వడంలేదు. ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అందాల ఆరబోతకు, గ్లామర్‌కే కాదు యాక్షన్‌కి సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు. పాత్ర, పాత్ర ప్రాధాన్యతను బట్టి హీరోయిన్గానే కాదు, హీరోకి చెల్లెలిగా కూడా నటిస్తున్నారు. లీడ్ రోల్స్‌తో సరిపెట్టకుండా కటెంట్ డిమాండ్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా కూడా మారుతున్నారు. స్టార్ రేంజ్‌లో ఉండగానే, క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు ముందుకు రావడాన్ని సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అలా నటించడం వాళ్ల కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్ల విషయంలో ఈ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం తమ రూటే సెపరేట్ అంటున్నారు. హీరోల సరసన అక్కలుగా, చెల్లెలుగా కూడా నటించడానికి వెనుకాడంటంలేదు. అలా నటించి మెప్పిస్తున్నారు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'సన్ ఆఫ్ సత్యమూర్తి'. ఈ మూవీలో హీరోయిన్లుగా సమంత, అదాశర్మ నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు మల్లూ బ్యూటీ నిత్యామీనన్ కూడా యాక్ట్ చేస్తోంది. అయితే ఈమె బన్నీకి చెల్లెలుగా నటిస్తోంది. ఈ విషయంపై నిత్య స్పందిస్తూ, గతంలో ఎంతోమంది హీరోహీరోయిన్లు బద్రర్స్ అండ్ సిస్టర్స్‌గా నటించారని గుర్తు చేశారు. అదే తరహాలో బన్నీతో కలిసి తాను నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.
జోష్ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన కార్తీక సైతం చెల్లెలుగా నటిచింది. అల్లరి నరేష్ పక్కన బొమ్మాళి సిస్టర్‌గా కనిపించి ప్రేక్షకుల్ని కవ్వించింది. ఆమె పాత్రకు మంచి పేరొచ్చినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బోల్తాపడింది. మీరా జాస్మీన్ గోరింటాకు చిత్రంలో యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్‌కి చెల్లెలుగా నటించి అలరించింది. వీరిద్దరి మధ్య నడిచే సెంటిమెంట్ సీన్లు మహిళ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ విజయంలో మీరాదే కీలక పాత్ర అంటూ క్రిటక్స్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.
తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కీర్తిరెడ్డి, ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో నటించి సక్సెస్ ట్రాక్ మెయింటైన్ చేసింది. అయితే కెరీర్ ఎండింగ్‌లో మాత్రం అర్జున్ సినిమాలో మహేష్‌కి అక్కగా మెరిసింది. ఈ చిత్రం ఫలితం నెగిటివ్‌గా వచ్చినప్పటికీ, కీర్తి చేసిన పాత్రకి మాత్రం ప్రేక్షకుల బాగానే మార్కులు వేశారు.