సూర్య '24' కథ ఇదే..? | suriya 24 movie story leaked | Sakshi
Sakshi News home page

సూర్య '24' కథ ఇదే..?

Published Sun, Nov 29 2015 9:41 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

సూర్య '24' కథ ఇదే..?

సూర్య '24' కథ ఇదే..?

దక్షిణాది సినీరంగంలో కమల్ హాసన్ స్థాయిలో ప్రయోగాలు చేసే విలక్షణ నటుడు సూర్య. సక్సెస్ లతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు సూర్య. అదే వరుసలో మరో ఎక్స్పరిమెంటల్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '24'  సినిమాను సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు.

కమర్షియల్ హీరోగా భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన సూర్య, ప్రయోగాత్మక చిత్రాలతో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. అందుకే '24' విషయంలో అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ ఎంతో ఆశించి వస్తారు. అయితే సినిమాలో ఆడియన్స్ ఆశించిన అంశాలు లేకపోవటంతో నిరాశపడతారు. ఈ ప్రభావం సినిమా టాక్ మీద కూడా పడుతుందని భావించిన 24 యూనిట్ చిత్రకథను ముందే లీక్ చేశారు.

'24' సినిమాలో టైంమిషీన్ తరహా వాచ్ తయారు చేసిన సూర్య, దాని సాయంతో తన గతంలోకి వెళ్లి తాను చేసిన తప్పులను సరిద్దిదుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ. ఈ సినిమాలో సైంటిస్ట్గా, అతని కొడుకుగా, ఆత్రేయ అనే విలన్గా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement