
అతిథులుగా ఆ ముగ్గురు..
మూడు భాషలకు చెందిన యువ స్టార్ హీరోలు అతిథులుగా ఇరుముగన్ చిత్రం గీతాలావిష్కరణకు సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. సియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. ఆయనతో తొలిసారిగా సంచలన నటి నయనతార జోడి కడుతున్నారు. మరో నాయకిగా నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని పులి చిత్ర నిర్మాతలో ఒకరైన శిబు తమీన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అరిమానంబి చిత్రంతో మెగాఫోన్ పట్టి మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు ఆనంద్‌శంకర్ తెరకెక్కిస్తున్న రెండో చి త్రం ఇది.
ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రెండు కోణాల్లో సాగే విభిన్న పాత్ర లో విక్రమ్ నటిస్తున్నారు. దీనిపై ఆయన చా లా ఆశలు పెట్టుకున్నారు. కారణం విక్రమ్ మంచి విజయాన్ని చూసి చాలా కాలమైంది. శంకర్ దర్శకత్వంలో నటించిన ఐ చిత్రం నటుడిగా ఆయన శ్రమకు మంచి పేరు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక దాని తరువాత నటించిన 10 ఎండ్రదుక్కుళ్ చిత్రం విక్రమ్‌ను పూర్తిగా నిరాశపరచింది. తాజా చిత్రం ఇరుముగన్ విజయం తథ్యం అనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.
ఇక ఈ చిత్రం విజయం నటుడు విక్రమ్‌కు చాలా అవసరం కూడా. హారీశ్‌జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నగరంలో ఆగస్టు రెండో తేదీన భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఆ కార్యక్రమానికి కోలీవుడ్‌కు చెందిన యువ నటుడు శివకార్తీకేయన్, టాలీవుడ్‌కు చెందిన టాప్ హీరో రామ్‌చరణ్, మాలీవుడ్‌కు చెందిన యువ నటుడు నవీన్ పాలీ అతిథులుగా పాల్గొన్ననున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించారు. వీరితో పాటు ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విచ్చేయనున్నట్లు తెలిపారు.