సహజీవనం నేపథ్యంలో... | ok bangaram movie release on next week | Sakshi
Sakshi News home page

సహజీవనం నేపథ్యంలో...

Published Sun, Apr 12 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

సహజీవనం నేపథ్యంలో...

సహజీవనం నేపథ్యంలో...

విదేశాలకు వెళ్లాలనుకునే  ఓ అమ్మాయికీ, ఓ అబ్బాయికీ ముంబయ్‌లో పరిచయం ఏర్పడుతుంది. విదేశాలు వెళ్లేవరకూ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. చివరికి ఇద్దరి ప్రయాణానికి సమయం దగ్గరపడుతుంది. ఇన్నాళ్లూ కలిసి ఉన్న ఈ ఇద్దరూ ఎవరి దారిన వాళ్లు విదేశాలు వెళతారా? లేక జతగా వెళతారా? అసలు విదేశాలు వెళ్లాలనే నిర్ణయాన్ని మార్చుకుంటారా? తదితర అంశాల సమాహారంతో మణిరత్నం తీసిన చిత్రం ‘ఓకే బంగారం’. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించారు. మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్త్తున్నాయి.
 
 వచ్చే వారం ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత ‘దిల్’ రాజు చెబుతూ - ‘‘సహజీవనంపై హిందీలో చాలా సినిమాలొచ్చాయి. కానీ, తెలుగులో ఈ అంశం పూర్తిగా కొత్త. ఈ చిత్రం యువతకూ, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే విధంగా ఉంటుంది. ఏఆర్. రహమాన్ స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీ ఓ హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement