
రైటర్ ఎవరు? ఫైటర్ ఎవరు? అంటే... రెండూ నిత్యా మీననే. బేసికల్లీ... ఆమె ఓ రైటర్. ఇంగ్లీష్‌లో ఏవేవో రాస్తుంటారు. బట్, రైటింగ్‌తో పాటు ఫైటింగ్ కూడా చేస్తుంటారామె. ఫైటింగ్ అంటే మనుషులను కొట్టడం వంటి రెగ్యులర్ ఫైటింగ్స్ కాదు. సొసైటీలోని అన్యాయాన్నీ (ఇన్‌జస్టిస్), అసహనాన్నీ (ఇన్‌టాలరెన్స్) తన రచనలతో ప్రశ్నిస్తూ, ఫైట్ చేస్తుంటారన్న మాట! క్లుప్తంగా కొత్త సినిమాలో నిత్యా మీనన్ పోషిస్తున్న పాత్ర తీరిది. ఓ రకంగా ఈ హీరోయిన్ ఒరిజినల్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉండే పాత్రే.
మలయాళ దర్శకుడు వీకే ప్రకాశ్ తీస్తున్న ‘ప్రాణ’లో నిత్యా మీనన్ ఈ ‘రైటర్ అండ్ ఫైటర్’ క్యారెక్టర్ చేస్తున్నారు. నిత్యాకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మాట్లాడడం వచ్చు కనుక... ఈ నాలుగు భాషల్లోనూ థ్రిల్లర్ సినిమాగా ‘ప్రాణ’ను తెరకెక్కిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కేరళలో చిత్రీకరణ మొదలైంది. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి తదితర టాప్ టెక్నిషియన్లు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment