
‘ఇలా బతకాలి’ అని కొందరికి లెక్కలుంటాయి. లెక్కలు కాదు కానీ కొందరికి ‘ఇలా బతకాలి’ అని కోరికలు ఉంటాయి. కోరికలు అనే కంటే ఆశలు అనాలి వాటిని. అందంగా ఉంటాయి ఆ ఆశలు. సౌతిండియన్ సినిమా స్టార్ హీరోయిన్లలో ఒకరైన నిత్యామీనన్‌కు కూడా కొన్ని ఇలాంటి అందమైన ఆశలు ఉన్నాయి. పిల్లలతో ఉండటమంటే ఆవిడకు చాలా ఇష్టం. పిల్లలతో కలిసి సరదాగా కబుర్లు చెప్పడం, ఆటలాడుకోవడం.. ఇలాంటివి నిత్యామీనన్‌కు ఎప్పుడూ ఒక ‘హై’ని ఇస్తాయట.
తాజాగా ఈమధ్యే బిజీ షెడ్యూల్స్‌లో ఖాళీ దొరికిన ఒకరోజు, తనకు దగ్గర్లో ఉన్న ఉడిపిలోని ఒక చిన్న ఊర్లోని పిల్లలను కలుసుకున్నారు నిత్యా. వారితో కలిసి అదే ఊర్లో ఉన్న ఒక పెద్ద కొండ ఎక్కి, కొండపైన కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ, ‘పిల్లలతో కలిసి ఇలా కొండెక్కి, ఇక్కణ్నుంచి కిందనున్న ఊరిని చూస్తున్నాం. ఇది బాగుంది. నాకు ఇలా బతకడం ఇష్టం’ అన్నారు నిత్యామీనన్!