కథ నచ్చితేనే సినిమా ఓకే చేసే నిత్యామీనన్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్, షోలు కూడా చేస్తోంది. ఆహాలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో జడ్జిగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం మోడ్రన్ లవ్ హైదరాబాద్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా మోడ్రన్ లవ్ హైదరాబాద్ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిత్యామీనన్ కర్ర పట్టుకుని మరో ఇద్దరి సాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది.
దీంతో నిత్యాకి ఏమైందా? అని అంతా కంగారుపడ్డారు. ఇక స్టేజీపైకి వచ్చిన నిత్య మాట్లాడుతూ.. ఇది యాక్టింగ్ కాదని క్లారిటీ ఇచ్చింది. సిరీస్‌లో ఇలానే నటించానని, రియల్ లైఫ్‌లో కూడా అదే జరిగి ఇప్పుడు అలాగే నడవాల్సి వస్తోందని పేర్కొంది. రెండు రోజుల క్రితం ఇంట్లో మెట్ల మీద నుంచి పడిపోయి కాలికి దెబ్బ తగిలిందని, అందుకే అలా కుంటుతూ నడిచానని తెలిపింది. నిత్యకు దెబ్బ తగిలినా కూడా పట్టించుకోకుండా ప్రమోషన్‌కు రావడంపై ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
చదవండి: అందుకు ఒప్పుకుంటేనే ఛాన్స్ ఇస్తానన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పిన నటి
పెళ్లి పుకార్లపై స్పందించిన హీరో రామ్
Comments
Please login to add a commentAdd a comment