సహజీవనం చేస్తే తప్పేంటి ! | Nithya Menon Comments On Relationship | Sakshi
Sakshi News home page

సహజీవనం చేస్తే తప్పేంటి !

Published Thu, Jun 4 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

సహజీవనం చేస్తే తప్పేంటి !

సహజీవనం చేస్తే తప్పేంటి !

 వివాహానికి ముందే నచ్చిన వాడితో సహజీవనం చేయడం తప్పుకాదు అంటోంది నటి నిత్యామీనన్. ఓ కాదల్ కణ్మని, కాంచన-2, చిత్రాలతో కోలివుడ్‌లో విజయాన్ని అందుకున్న సంతోషంలో ఉన్న ఈ కేరళ కుట్టి ఓ కాదల్ కణ్మని చిత్రంలో ప్రేమించిన వాడితో పెళ్లికాకుండానే సహజీవనం చేసే ప్రేయసిగా నటించారనడం కంటే, జీవించారని చెప్పాలి. అయితే, అలా నటించిన ఆమెను  నిజ జీవితంలో పెళ్లికాకుండా సహజీవనం తప్పు కాదా..? అన్న ప్రశ్నకు ఆమె అందులో తప్పేముంది అని సమాధానం ఇచ్చారు.
 
 దీని గురించి నిత్యామీనన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, మణిరత్నం దర్శకత్వంలో నటించడం గొప్పగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ముందుగా ఆయన ఓ కాదల్ కణ్మని చిత్రం కథ చెప్పినప్పుడు, ప్రేమ పెళ్లి విషయాల గురించి తాను ఎలా భావిస్తానో అలాగే చెప్పినట్టుందన్నారు. వివాహానికి ముందుకు సహజీవనం చేయడం అనేది, ఈ రోజుల్లో పెద్ద విషయమేమీ కాదని చెప్పింది. ఇలాంటి విషయాల్లో యువత స్వేచ్ఛ కోరుకుంటున్నదని, అందుకు తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారన్నారు.
 
 పెళ్లికి ముందే నచ్చిన వాడితో సహజీవనం చేయడం తప్పు అని తనకు అనిపించడం లేదని పేర్కొంది.  వెనుకముందు తెలియని ఎవరో ఒకర్ని వివాహం చేసుకునేది తనకు సమ్మతం కాదంది.  సర్దుకుపోయి జీవించడం కంటే, ముందే, సరైన నిర్ణయం తీసుకోవడం మంచిదని తన భావనను వ్యక్తం చేసింది. ఈ బ్యూటీ తన పేరు చివర ఉన్న మీనన్  పేరును తొలగించినట్టు పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement