నేను రెడీ మీరు రేడీనా? | i am ready you ready? - nithya menon | Sakshi
Sakshi News home page

నేను రెడీ మీరు రేడీనా?

Published Sat, Jul 11 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

నేను రెడీ  మీరు రేడీనా?

నేను రెడీ మీరు రేడీనా?

తమిళసినిమా: ప్రజలకు కాలక్షేపం అయినా, సినిమా వ్యాపార మాద్యమమేనన్నది ఎవరూ కాదనలేరు. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ధోరణి బాగా పెరిగి పోతోందన్నది చర్చనీయాంశంగా మారింది. అలాంటి చాలా మంది తారల్లో నటి నిత్యామీనన్ పేరు చోటు చేసుకుందన్నది.

 

కోలీవుడ్ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న మాట నటన,గానం ఈ రెండింటిలోనూ చక్కని ప్రావీణ్యం కలిగిన నిత్యామీనన్ నటనకే ప్రాముఖ్యత నిచ్చి మలయాళం, కన్నడం, తమిళ్, తెలుగు భాషల్లోనూ కథానాయికిగా పేరు తెచ్చుకున్నారు. దానితో పాటు పొగరుబోతు అనే అదనపు క్వాలిఫికేషన్ కూడా పెంచుకుంటూ వస్తున్నారు. ఆమె నటనను మెచ్చుకుంటున్నవారు, పొగరు కాస్త ఎక్కువనే తన ప్రవర్తనను కూడా బహిరంగంగానే ఎత్తి చూపిస్తూనే ఉన్నారు.

అయినా నేనింతే. ఎవరి కోసమో మారాల్సిన అవసరం నాకు లేదు. అన్నట్లు నిత్యామీనన్ నడుచుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మణిరత్నం ఓ కాదల్ కణ్మణి,లారెన్స్ కాంచన-2 చిత్రాలతో కోలీవుడ్‌లో సక్సెస్ ఖాతా ప్రారంభించలేదన్న కొరత తీరిపోయింది. ముఖ్యంగా ఓ కాదల్ క న్మణి చిత్రంలో ప్రేమ సన్ని వేశాల్లో రెచ్చిపోయి నటించి కుర్రకారు గుండెల్ని బాగా టచ్ చేశారనే చెప్పాలి. విషయం ఏమిటంటే అయినా ఈ నయనానంద నటికి కోలీవుడ్ కొత్తగా అవకాశాలేవి రాలేదు.

 

అలా అనడం కంటే ఆమె అంగీకరించలేదు అనడం సబబేమో. కారణం కథలు చెప్పడానికి వచ్చే దర్శక నిర్మాతతో హీరోకు సమానంగా నా పాత్ర ఉండాలి. అలాగే కథ చెప్పడానికి ముందే ఇంతకు ముందు కంటే నా పారితోషికం డబుల్. అందుకు మీరు రెడీ అంటే కథ వినడానికి నేను రెడీ అంటూ హడల్ కొడుతున్నారట. దీంతో దర్శకనిర్మాతలు నిత్యామీనన్ అంటేనే బెదిరిపోతున్నారని కోలీవుడ్ వర్గాల బోగట్టా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement