ఆన్‌లైన్‌లో అజిత్ చిత్రం | Ajith's Yennai Arindhaal released Online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో అజిత్ చిత్రం

Published Thu, Mar 19 2015 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

ఆన్‌లైన్‌లో అజిత్ చిత్రం

ఆన్‌లైన్‌లో అజిత్ చిత్రం

డెరైక్టర్ చేరన్ దర్శకత్వం వహించిన ‘జె కె’ అనే చిత్రం స్నేహితుని జీవితం కథాంశంతో రూపొందించారు. ఈ చిత్రంలో శర్వానంద్, నిత్యామీనన్, సంతానం తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా డీవీడీలుగా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు. దీని తర్వాత గౌతం మీనన్ దర్శకత్వంలో అజిత్, త్రిష, అనుష్క నటించి ఇటీవల తెరకెక్కిన ‘ఎన్నై అరిందాల్’ చిత్రం ఆన్‌లైన్‌లో విడుదలైంది. హెచ్‌డీ స్థాయిలో ఆంగ్ల టైటిల్‌తో ఇది విడుదలైంది. అయితే విదేశాల్లో వున్న అభిమానులు మాత్రమే దీన్ని చూసే వీలుంది. డీవీడీలోను, ఆన్‌లైన్‌లోను చిత్రాలు విడుదల కావడం కలకలం సృష్టించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఇదేవిధంగా మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నట్లు తెలియడంతో కోలీవుడ్‌లో చర్చ మొదలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement