వీరిలో చెల్లెలు ఎవరు? | Brother Sister Supplement movie in Kollywood | Sakshi
Sakshi News home page

వీరిలో చెల్లెలు ఎవరు?

Published Wed, Apr 15 2015 4:13 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

వీరిలో చెల్లెలు ఎవరు?

వీరిలో చెల్లెలు ఎవరు?

 కథానాయకులకు చెల్లెల్లుగా నటించి పేరు తెచ్చుకున్న ప్రముఖ నటీ మణులు సినీ చరిత్రలో చాలా మందే ఉన్నారు.  నాటి రక్త సంబంధం నుంచి ఈ మధ్య వచ్చిన పుట్టింటికి రా చెల్లి, అన్న వరం, ఇలా చాలా చిత్రాలు అన్నా చెల్లెల సెంటిమెంట్‌లో పండినవే. అలాంటి అన్నా చెల్లెళ్ల అనుబంధంతో కోలీవుడ్‌లో ఓ చిత్రం రూపొందనుంది.
 
  ఆ చిత్ర కథనాయకుడు అజిత్. దర్శకుడు శివ. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇటీవల వీరం చిత్రం విజయవంతమైన విషయం తెలిసిందే. మరో సారి వీరి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రాన్ని శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్‌కు చెల్లెలు పాత్ర కీలకంగా ఉంటుందన్నది సమాచారం. ఆ పాత్ర కోసం నటి నిత్య మీనన్, శ్రీ దివ్యలో ఎవరో ఒకరిని నటింప చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.
 
  వారితో సంప్రదింపులు జరుగుతున్నట్టు  తెలిసింది. నిత్యా మీనన్, శ్రీ దివ్య తమిళంతో పాటుగా తెలుగులోని ప్రాచుర్యం పొందిన నటీమణులే. ఈ రెండు భాషల్లోను వీరికి మార్కెట్ ఉండటం గమనార్హం. అలాంటి వాళ్లల్లో  అజిత్‌కు చెల్లలుగా నటించే అవకాశం ఎవరిని వరిస్తుందో అన్నదే ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ. అజిత్ వీరం చిత్రంలో నలుగురు తమ్ముళ్లకు అన్నగా నటించి హిట్ కొట్టారు. తాజా చిత్రంలో చెల్లమ్మ సెంటిమెంట్‌తో ఏ స్థాయిలో విజయం సాధిస్తారోనన్నది వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement