
పద్ధెనిమిదేళ్లకే ప్రేమలో పడ్డా!
కొంతమంది అమ్మాయిల నయనాలు... చూసేకొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మరిపించేలా చేస్తాయి.
కొంతమంది అమ్మాయిల నయనాలు... చూసేకొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మరిపించేలా చేస్తాయి. సరిగ్గా నిత్యామీనన్ కళ్లు చూస్తే అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఆమె ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లోనే నటించారు. ప్రేమసన్నివేశాల్లో ఆమె హావభావాలు వీక్షకుల మనసులకు గిలిగింతలు పెడతాయి. ఇదే విషయాన్ని ఈ భామను చాలా మంది అడిగారట. ‘‘నాకు ఎలా చెప్పాల్లో అర్థం కావట్లేదు. నేను పద్ధెనిమిదేళ్ల్ల వయసులో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డాను.
అందుకేనేమో ప్రేమ కథాచిత్రాల్లో ఇంతలా ఒదిగిపోగలుగుతున్నాను. ఆ ప్రేమ గురించి ఎక్కువ వివరాలు మాత్రం అడగొద్దు. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు జరిగిన విషయం అది. ఇప్పుడు మాత్రం నేను సింగిల్‌గా..., చాలా సంతోషంగా ఉన్నా. ఏయే సందర్భాల్లో ఎలా ఉండాలో నా జీవితమే నాకు నేర్పింది. జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్నీ ప్రేరణగా తీసుకుని నటిస్తాను’’ అని నిత్యామీనన్ తన మనసులో భావాలను ఆవిష్కరించారు.