విశాల్‌తో నటించే భామ ఏవరో? | Samantha or Nithya Menon for Vishal? | Sakshi
Sakshi News home page

విశాల్‌తో నటించే భామ ఏవరో?

Published Sun, May 17 2015 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

విశాల్‌తో నటించే భామ ఏవరో?

విశాల్‌తో నటించే భామ ఏవరో?

నటుడు విశాల్ ఇటీవల నటుడిగా, నిర్మాతగా వేగం పెంచారు. అలాగే వరుసగా విజయాలు సాధిస్తున్నారు. పాండియనాడు, నాన్ శివప్పు మనిదన్,

నటుడు విశాల్ ఇటీవల నటుడిగా, నిర్మాతగా వేగం పెంచారు. అలాగే వరుసగా విజయాలు సాధిస్తున్నారు. పాండియనాడు, నాన్ శివప్పు మనిదన్, పూజై, ఆంబళ ఈ చిత్రాలన్నీ విశాల్‌కు విజయాలను అందించిన వే. ప్రస్తుతం సుశీంద్రన్ దర్శకత్వంలో పాయుం పులిగా రాబోతున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. తదుపరి రెండు చిత్రాలకు విశాల్ కమిట్ అయ్యారు. వాటిలో ఆయన్ని యాక్షన్ హీరోగా నిలబెట్టగా సండకోళి చిత్రానికి సీక్వెల్, రెండవది పాండిరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రం ఈ రెండు చిత్రాల షూటింగ్ ఏకకాలంలో జరగనున్నాయనే ప్రచారం జరిగింది.
 
 అయితే సండైకోళి-2 చిత్రం నిర్మాణం వాయిదా పడిందని పాండిరాజ్ దర్శకత్వం వహించే చిత్ర షూటింగ్ త్వరలో మొదలవుతుందని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ వర్గాలు సమాచారం. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విశాల్‌తో నటించని హీరోయిన్ల కోసం అన్వేషణ జరుగుతోందట. ఆ పట్టికలో నటి సమంత, నిత్యామీనన్ ముందున్నారని తెలిసింది. వీరిలో ఎవరు ఓకే అవుతారన్నది త్వరలోనే వెల్లడి కానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిళం సంగీతాన్ని అందించనున్నారు. ఈయన ఇంతకుముందు విశాల్ నటించిన ఆంబళ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement