జనతా గ్యారేజ్ రెడీ టు స్టార్ట్! | anata Garage Ready to Start! | Sakshi
Sakshi News home page

జనతా గ్యారేజ్ రెడీ టు స్టార్ట్!

Published Mon, Feb 8 2016 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

జనతా గ్యారేజ్ రెడీ టు స్టార్ట్!

జనతా గ్యారేజ్ రెడీ టు స్టార్ట్!

‘మిర్చి’లో ప్రభాస్‌ని చాలా డైనమిక్‌గా, ‘శ్రీమంతుడు’లో మహేశ్ బాబుని చాలా లవ్లీగా చూపించిన కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్‌ని డాషింగ్ మెకానిక్‌గా చూపించడానికి రెడీ అవుతున్నారు. సో.. ఎన్టీఆర్ పూర్తిగా డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని చెప్పొచ్చు. జనతా గ్యారేజీలో పని చేసే మెకానిక్‌గా, కాలేజ్ స్టూడెంట్‌లా ఈ చిత్రంలో యంగ్ టైగర్ టూ షేడ్స్ ఉన్న పాత్ర చేయనున్నారు. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం జనతా గ్యారేజీ సెట్‌ని రెడీ చేయిస్తున్నారు. ఆర్ట్ డెరైక్టర్ ఏయస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఈ సెట్ తయారవుతోంది. సెట్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నెల 24న షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చే పనిలో ఉన్నారు.

 ఆ ముగ్గురిలో ఎవరు?
 ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు కథానాయికలు కనువిందు చేస్తారు. ఓ నాయికగా నిత్యామీనన్‌ని ఎంపిక చేశారు. మరో నాయిక పాత్ర కోసం శ్రుతీహాసన్, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్‌ల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురు నాయికలూ ఎన్టీఆర్‌తో ఆల్రెడీ జతకట్టినవారే. మరి.. మరోసారి ఎవరికి చాన్స్ దక్కుతుందో వేచి చూడాలి.

 పన్నెండేళ్ల తర్వాత దేవయాని!
 పవన్ కల్యాణ్ సరసన ‘సుస్వాగతం’లో నటించిన దేవయాని గుర్తున్నారు కదా. మహేశ్‌బాబుకి తల్లిగా ‘నాని’లో కూడా నటించారు. ఆ చిత్రం తర్వాత దేవయాని తెలుగు సినిమాల్లో నటించలేదు. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఆమె ‘జనతా గ్యారేజ్’లో నటించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జతగానే దేవయాని కనిపించనున్నారట. మొత్తం మీద ఎన్టీఆర్ క్యారెక్టర్ పరంగా, క్యాస్టింగ్ పరంగా ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ సినిమా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement