Devayaani (actress)
-
జనతా గ్యారేజ్ రెడీ టు స్టార్ట్!
‘మిర్చి’లో ప్రభాస్‌ని చాలా డైనమిక్‌గా, ‘శ్రీమంతుడు’లో మహేశ్ బాబుని చాలా లవ్లీగా చూపించిన కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్‌ని డాషింగ్ మెకానిక్‌గా చూపించడానికి రెడీ అవుతున్నారు. సో.. ఎన్టీఆర్ పూర్తిగా డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని చెప్పొచ్చు. జనతా గ్యారేజీలో పని చేసే మెకానిక్‌గా, కాలేజ్ స్టూడెంట్‌లా ఈ చిత్రంలో యంగ్ టైగర్ టూ షేడ్స్ ఉన్న పాత్ర చేయనున్నారు. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం జనతా గ్యారేజీ సెట్‌ని రెడీ చేయిస్తున్నారు. ఆర్ట్ డెరైక్టర్ ఏయస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఈ సెట్ తయారవుతోంది. సెట్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నెల 24న షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చే పనిలో ఉన్నారు. ఆ ముగ్గురిలో ఎవరు? ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు కథానాయికలు కనువిందు చేస్తారు. ఓ నాయికగా నిత్యామీనన్‌ని ఎంపిక చేశారు. మరో నాయిక పాత్ర కోసం శ్రుతీహాసన్, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్‌ల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురు నాయికలూ ఎన్టీఆర్‌తో ఆల్రెడీ జతకట్టినవారే. మరి.. మరోసారి ఎవరికి చాన్స్ దక్కుతుందో వేచి చూడాలి. పన్నెండేళ్ల తర్వాత దేవయాని! పవన్ కల్యాణ్ సరసన ‘సుస్వాగతం’లో నటించిన దేవయాని గుర్తున్నారు కదా. మహేశ్‌బాబుకి తల్లిగా ‘నాని’లో కూడా నటించారు. ఆ చిత్రం తర్వాత దేవయాని తెలుగు సినిమాల్లో నటించలేదు. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఆమె ‘జనతా గ్యారేజ్’లో నటించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జతగానే దేవయాని కనిపించనున్నారట. మొత్తం మీద ఎన్టీఆర్ క్యారెక్టర్ పరంగా, క్యాస్టింగ్ పరంగా ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ సినిమా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:విజయ్ (హీరో), దేవయాని(నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఆస్తులు కొనాలన్న వీరి కోరిక ఈ సంవత్సరం తీరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వాహనాలు కొంటారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. పుట్టిన తేదీలో రెండు రెండ్లు ఉండటం వల్ల మీ కల్పనాశక్తి వెలుగులోకి వస్తుంది. దూకుడుగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం వల్ల సహోద్యోగులతోనూ, తోటివారితోనూ వివాదాలు తలెత్తవచ్చు. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం. లక్కీ డేస్: 1,4,6,9; లక్కీ కలర్స్: వయొలెట్, రోజ్, ఆరంజ్, రెడ్; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు సూచనలు: మాట లలోనూ, చేతలలోనూ సంయమనం పాటించాలి. దుర్గాదేవి ఆలయాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేయించుకోవాలి. ప్రసిద్ధమైన దర్గా లు లేదా చర్చిలను తప్పక సందర్శించండి. మత విశ్వాసం వున్న వారు ఆయా మతగ్రంథాలను పఠించడం మంచిది. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు