
విక్రమ్‌లా నటించాలని ఉంది
నా కళ్లు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని అనే సినీ గీతం నాటి తరం యువతను ఉర్రూతలూగించింది.
నా కళ్లు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని అనే సినీ గీతం నాటి తరం యువతను ఉర్రూతలూగించింది.అలాంటిది నా కళ్లు ఊసులాడతాయంటోంది నటి నిత్యామీనన్. గుండ్రటి కళ్లను చక్రాలా తిప్పుతూ అందమైన నగుమోముతో నిత్య ఒక్క నవ్వు నవ్వితే చాలు కుర్రకారు గుండెలు లబ్‌డబ్ అనడం మానేసి లవ్‌డబ్ అని చప్పుడు చెయ్యడం ఆరంభిస్తాయి. మొదట్లో మల యాళం ప్రేక్షకుల్నే అలరించడానికి పరిమితమైన ఈ కేరళ కుట్టి ఆ తరువాత క్రమంగా తమిళం,తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం మొదలెట్టిం ది. టోటల్‌గా నిత్య ఇప్పుడు దక్షిణాది క్రేజీ కథానాయికి అయిపోయింది. ముఖ్యంగా ఓ కాదల్ కణ్మణి, కాంచన 2 చిత్రాల విజయాలతో తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ఈ సొగసు కళ్ల చిన్నదానితో చిన్న కబుర్లు.
మీరు చాలా ముక్కోపి అటగా?
అవునా?నాకే తెలియని విషయాల్ని తెలియ జేస్తున్నారు. తిండి, బస విషయంలో సర్దుకుపోయే అమ్మాయిని నేను.అయితే చాలా సెన్సిటివ్‌ని కూడా. ఎవరైనా అదేపనిగా నన్నే చూస్తుంటే నాకో మాదిరిగా ఉంటుంది.
మీకు అత్యంత స్నేహితురాలెవరు?
నటి రోహిణి. చెన్నై వస్తే వాళ్ల ఇంటిలోనే బస, భోజనం . అంత స్నేహం ఉంది ఆమెతో.
నచ్చిన హీరో?
విక్రమ్ సార్ అంటే చాలా ఇష్టం. నటన కోసం అం తలా అంకితమయ్యే నటుడ్ని ఎవర్నీ చూడలేదు. పాత్రగా మారడంలో ఆయన కిల్లాడి. ఆయన మాదిరి నటించాలని ఆకాంక్ష.
మీరు దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం గురించి?
ఇదే విషయాన్ని అందరూ అంటున్నారు. నేను మాత్రం ఎప్పుడూ,ఎక్కడా చెప్పలేదు.అయితే చాలా కథలు రాస్తుం టాను. కానీ దర్శకత్వం విషయం గురించి ఆలోచన లేదు.ఇం తకు ముందు చాయాగ్రహణం పై మోజు పడ్డాను. ఇప్పుడు అదీ లేదు. చేతినిండా చిత్రాలు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దాం.
నటిస్తున్నప్పుడు భాషా పరమైన సమస్యనెదుర్కొన్న సందర్భం ఉందా?
నిజం చెప్పాలంటే మాతృభాషతోనే నాకు గొడవ. సరళంగా మాట్లాడడానికి తడబడతాను. చాలా సంవత్సరాలు బెంగళూర్‌లో నివసించడం వల్ల తమిళం, కన్నడ భాషలను ఫ్లూయంట్‌గా మాట్లాడగలను. మలయాళం,తెలుగే తడబడతాను.అయితే ఇప్పుడు నాలుగు భాషలు బాగా నేర్చుకున్నాను కాబట్టి భాషా పరమైన సమస్యల్ని అధిగమించాను.
మీకు ప్లస్ మీ కళ్లే కదా?
నా కళ్ల గురించి నేనే ఎలా చెప్పుకోను. నటిస్తున్నప్పుడే కాదు సాధారణంగా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడూ నా కళ్లు ఊసులాడతాయి. అది నాలో సహజ గుణమే. ఇంకో విషయం ఏమిటంటే నేను చాలా సింపుల్‌గా ఉంటాను. ఇంకా చెప్పాలంటే నేను నేనులానే ఉంటాను.
తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయడం లేదే?
చాలా సెలెక్టెడ్ చిత్రాలనే చేస్తున్నాను.చిత్ర కథ నన్ను టచ్ చేయాలి. అలాంటి చిత్రాలనే అంగీకరిస్తున్నాను.ఎన్ని చిత్రాలు చేశావన్నది ముఖ్యం కా దు.మంచి చిత్రాలెన్ని చేశామన్నదే నాకు ముఖ్యం.