ఈ హీరోయిన్ను గుర్తుపట్టగలరా? | Nitya menon as a child artist | Sakshi
Sakshi News home page

ఈ హీరోయిన్ను గుర్తుపట్టగలరా?

Published Sat, Oct 8 2016 5:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

ఈ హీరోయిన్ను గుర్తుపట్టగలరా?

ఈ హీరోయిన్ను గుర్తుపట్టగలరా?

2011లో టాలీవుడ్ లోకి ఎంటరైన ఆమె.. 'హైదరాబాదే ఈజ్ డెస్టినేషన్' అని చెప్పుకునేలా అభిమానాన్ని పంచారు తెలుగు ప్రేక్షకులు. ఆ బ్యూటిఫుల్ యాక్టర్..

అది.. 1998. అప్పుడామెకు 10ఏళ్లు. అంతా భారతీయులే రూపొందించిన ఇంగ్లీష్ సినిమా 'The Monkey Who Knew Too Much'లో హీరోయిన్ టబుకు చిన్న చెల్లిగా నటించింది. మరో ఏడేళ్ల తర్వాత.. 'సెవెన్ ఓ క్లాక్' అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే తన మాతృభాష మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా దిగ్గజ దర్శకుడు కె.పి.కుమారన్ తీసిన 'ఆకాశ గోపురం'లో నటించింది. జాతీయస్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టిన ఆ సినిమాతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.. మలయాళ, కన్నడలో వరుస సినిమాలు చేసింది.

2011లో టాలీవుడ్ లోకి ఎంటరైన ఆమె.. 'హైదరాబాదే ఈజ్ డెస్టినేషన్' అని చెప్పుకునేలా అభిమానాన్ని పంచారు తెలుగు ప్రేక్షకులు. అవును మనం చెప్పుకుంటున్నది బ్యూటిఫుల్ యాక్టర్ నిత్యా మీనన్ గురించే. 'జనతా గ్యారేజ్'తో హిట్ట్ కొట్టిన నిత్య ఇప్పుడు వెంకటేశ్ తో జోడీ కట్టి రాబోయే సినిమా అంచనాలను పెంచేసింది. తన 10వ ఏట నిత్యా మీనన్ 'The Monkey Who Knew Too Much'లో టబుకు చెల్లెలుగా నటించినప్పటి ఫొటోలివి. ఆ సినిమాలో నిత్య నటించిన సీన్లు వీడియోలో చూడొచ్చు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement