
రియాలిటీ షో
‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘ఓకే బంగారం’, ‘గంగ’ చిత్రాల్లో నటించి మురిపించిన నిత్యామీనన్ కథానాయికగా మరో చిత్రం రానుంది. నిత్యామీనన్, ఉన్ని ముకుందం, శ్వేతా మీనన్, సిద్దిక్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రాన్ని ‘ఈ వేళలో’ పేరుతో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. టి.కె రాజీవ్ కుమార్ దర్శకుడు. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘టీవీ రియాలిటీ షో, రేటింగ్స్ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ప్రేమకథ ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శరత్, మాటలు- పాటలు: అంజలి గెర్రి, కెమెరా: వినోద్ ఇల్లంపల్లి.