మిక్కీ కోసం తమన్... | taman Sang song Mickey J Meyer movie | Sakshi
Sakshi News home page

మిక్కీ కోసం తమన్...

Published Wed, Mar 9 2016 10:50 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

మిక్కీ కోసం తమన్... - Sakshi

మిక్కీ కోసం తమన్...

 సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. దీని కోసం సంగీత దర్శకుడు తమన్ ఓ పాట పాడారు. ఇందులో విశేషం ఏముంది అనుకోవచ్చు? ఈ చిత్రానికి స్వరకర్త మిక్కీ జె. మేయర్. ఒకరి స్వర సార థ్యంలో మరో సంగీత దర్శకుడు పాడడం అరుదు.

  కొన్నేళ్ల క్రితం ‘బృందావనం’ చిత్రం కోసం తమన్  ‘వచ్చాడురా...’ పాటను కోటి, కీరవాణిలతో పాడించారు. అయితే ఈ సారి తమన్ తన ఫ్రెండ్ మిక్కీ జె. మేయర్ కోసం  పాట పాడారు. ‘‘హీరో పరిచయగీతం తమన్ పాడితే బాగుంటుందని అనుకుని అడిగాను. వెంటనే ఓకే అని పాడిన తమన్‌కు థ్యాంక్స్’’ అని మిక్కీ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement