
నిత్యామీనన్
ఓ నేరానికి సంబంధించిన ఆధారాల కోసం ఓ పోలీసాఫీసర్‌తో కలిసి వర్కవుట్ చేస్తున్నారు నిత్యామీనన్. విషయం ఏంటంటే.. ఆమె ఓ క్రైమ్ థ్రిల్లర్‌లో కథానాయికగా నటిస్తున్నారు. ‘ఆరమ్ తిరుకల్పన’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అజయ్ దేవలోక దర్శకుడు. షైన్ టామ్ చాకో ఈ చిత్రంలో హీరోగా నటిస్తారు. ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘‘ఈ సంఘటన గురించి షైన్‌తో మాట్లాడినప్పుడు చాలా కొత్తగా ఉందన్నాడు. స్క్రీన్‌ప్లే ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. షైన్ పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నారు. నిత్యామీనన్ పాత్ర స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది’’ అని అజయ్ దేవలోక పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment