విజయ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌ | The audio of Mersal will be released on 20th of this month | Sakshi
Sakshi News home page

విజయ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

Published Sat, Aug 5 2017 1:32 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

విజయ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

విజయ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

తమిళసినిమా: ఇళయదళపతి విజయ్‌ కొత్త చిత్రం రావడమే ఆయన అభిమానులకు సంతోషకరమైన వార్త అవుతుంది. అదీ ఒక సక్సెస్‌ఫుల్‌ కాంబినేషనల్‌లో చిత్రం వస్తుందంటే మరీ ఆనందం. అలా త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న చిత్రం మెర్శల్‌. విజయ్‌ నటిస్తున్న 61వ చిత్రం ఇది. ఈ చిత్రం పలు ప్రత్యేకతలను సంతరించుకుందని చెప్పవచ్చు. ఇందులో విజయ్‌కు జంటగా కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌ ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక వైగైపుయల్‌ వడివేలు, సత్యరాజ్‌ వంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత బాణీలు కడుతుండడం మరో విశేషం. ఇక తెరి వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత విజయ్‌ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం మెర్శల్‌. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న శత చిత్రం ఇది కావడం మరో విశేషం.

ఇన్ని ప్రత్యేకతలతో కూడుకున్న ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అన్న ఆసక్తి ఆయన అభిమానుల్లోనూ, చిత్ర పరిశ్రమలోనూ నెలకొనడం సహజమే. అంతకన్నా ముందు చిత్ర ఆడియోను ఈ నెల 20వ తేదీన చిత్ర యూనిట్‌ గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోందన్నది తాజా సమాచారం. కాగా ఈ వేడుకలో మరో విశేషం ఏమిటంటే సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీత కచేరిని నిర్వహించనున్నారట. ఇది విజయ్‌ అభిమానులకు వీనులవిందైన వార్తే అవుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement