మెర్సల్‌ ట్విట్టర్‌ రికార్డ్‌ | mage Identity for Vijay 'Merzal' by Twitter India | Sakshi
Sakshi News home page

మెర్సల్‌ ట్విట్టర్‌ రికార్డ్‌

Published Sat, Aug 19 2017 1:05 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

మెర్సల్‌ ట్విట్టర్‌ రికార్డ్‌

మెర్సల్‌ ట్విట్టర్‌ రికార్డ్‌

తమిళసినిమా: ఇలయదళపతి విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం మెర్సల్‌. ఈ చిత్రం గురించి రోజుకో కొత్త సమాచారం వెల్లడవుతోంది. ప్రస్తుతం విషయం ఏమిటంటే సామాజిక మాధ్యమాల్లో ప్రముఖమైన ట్విట్టర్‌ ఇండియా సంస్థ విజయ్‌ ‘మెర్సల్‌’ చిత్రానికి ఇమేజ్‌ గుర్తింపు నిచ్చింది. ఈ విషయం తెలిసి విజయ్‌ అభిమాలను ఎగిరి గంతులేస్తున్నారు. తెరి చిత్రం తర్వాత విజయ్‌ – అట్లీ బృందం రూపొందించిన చిత్రం మెర్సల్‌.

మూడు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సరసన సమంత, నిత్యామీనన్, కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తుండగా, తేనాండాల్‌ ఫిలింస్‌ 100వ చిత్రంలో తయారువుతోంది. ఈ నెల 20వ తేదీ చెన్నై నెహ్రూ క్రీడా మైదానంలో ‘మెర్సల్‌’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించనున్నారు. ఇందుకుగాను ఏర్పాటు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ స్థితిలో మెర్సల్‌ విజయ్‌ స్టిల్స్‌తో కూడిన ఇమేజ్‌ను ట్విటర్‌ ఇండియా విడుదల చేసింది. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement