మళ్లీ జతగా...! | Dulquar and Nithya Menon Again in Telugu | Sakshi
Sakshi News home page

మళ్లీ జతగా...!

Published Sat, Sep 26 2015 10:59 PM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

మళ్లీ జతగా...! - Sakshi

మళ్లీ జతగా...!

 ఏ హీరో, హీరోయిన్ మధ్య అయినా మంచి కెమిస్ట్రీ కుదిరితే అది సినిమాకి ప్లస్ అవుతుంది. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ అలాంటి జంటే. మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’లో, ఆ మధ్య విడుదలైన ‘ఓకే బంగారం’ చిత్రాల్లో వీళ్ల కెమిస్ట్రీ అదనపు ఆకర్షణ అయ్యింది. ఇప్పుడు ‘ఉస్తాద్ హోటల్’ ద్వారా మరోసారి తెలుగు తెరపై జతగా రానున్నారు. ఈ చిత్రాన్ని ‘జతగా...’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి అనువదించారు. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి.
 
 ఈ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించడంతో పాటు మూడు జాతీయ అవార్డులు గెల్చుకుందని సురేశ్ కొండేటితెలిపారు. మరిన్ని విశేషాలను ఆయన చెబుతూ - ‘‘ఏ భాషకైనా నప్పే కథ. అందుకే తెలుగులో విడుదల చేస్తున్నాను. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. సాహితి రాసిన సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే, గోపీసుందర్ స్వరపరచిన పాటలు మరో హైలైట్. త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement