Dulqueer Salman
-
టాలీవుడ్ పై దుల్కర్ డామినేషన్
-
'సీతారామం' ఫస్ట్ ఛాయిస్ పూజా హెగ్డేనే, కానీ ఏమైందంటే..
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో నటించిన మృణాల్ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. సీత పాత్రలో నటించిన మృణాల్ నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అయితే నిజానికి సీత పాత్రకు మృణాల్ కాకుండా ముందు వేరే హీరోయిన్ను అనుకున్నారట. మన బుట్టబొమ్మ పూజాహెగ్డేను ఈ సినిమాలో హీరోయిన్గా మూవీటీం ఫైనల్ చేశారట. కానీ కోవిడ్ వల్ల షూటింగ్ లేట్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. అసలే హిట్స్ లేక తంటాలు పడుతున్న పూజా ఈ సినిమా నుంచి తప్పుకొని ఓ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. చదవండి: అప్పుడే ఓటీటీలోకి 'సీతారామం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే -
అప్పుడే ఓటీటీలోకి 'సీతారామం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'సీతారామం'. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే హిట్ టాక్ని సొంతం చేసుకుంది.ఈ చిత్రంలో రష్మిక, తరుణ్ భాస్కర్, సుమంత్, భూమిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ సహా హీరో,హీరోయిన్ల కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ నుంచి సుమారు ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. చదవండి: డైరెక్టర్‌ను పట్టుకొని ఏడ్చేసిన హీరోయిన్.. వీడియో వైరల్ -
ఇక స్పీడ్ పెంచుతా
‘‘నా సినిమా కథలు ముందుగా నాన్న వింటారు. సెట్స్‌కు వెళ్లే ముందు బన్నీ (అల్లు అర్జున్) కూడా వింటాడు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకుంటాను. షూటింగ్ పూర్తి చేసి, ఎడిటింగ్ అయిన తర్వాత కూడా వారికి సినిమా చూపిస్తా’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. నేడు (బుధవారం) పుట్టినరోజు జరుపుకుంటున్న శిరీష్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో దుల్కర్ సల్మాన్ చేసిన మలయాళ ‘ఏబీసీడీ’ రీమేక్ ఒకటి. సూర్యగారు హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నటిస్తున్నా. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌గారు కూడా ఉన్నారు. సూర్యగారికి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీ. జూలై 1న లండన్‌లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ‘ఏబీసీడీ’ రీమేక్‌లో మిలియనీర్ కొడుకుగా కనబడతా. సంజీవ్ కొత్త డైరెక్టర్ అయినా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తనపై నాకు నమ్మకం ఏర్పడింది. రీమేక్ చేయడం చాలా కష్టం. రీమేక్‌ల గురించి మనం ఆలోచించినంతగా ప్రేక్షకులు ఆలోచించరు. వారికి సినిమా నచ్చితే చాలు. ఇలాంటి సినిమాలే చేయాలని హద్దులు పెట్టుకోలేదు. ‘ఒక్క క్షణం’ సినిమా కమర్షియల్‌గా ఆశించినంత రిజల్ట్ ఇవ్వలేదు. నా వరకు నా కెరీర్లో బెస్ట్ మూవీ అది. ఇతర హీరోల్లా వేగంగా సినిమాలు చేయడం లేదు. మా అన్నయ్య వచ్చి 15 ఏళ్లు అవుతున్నా 17 సినిమాలే చేశాడు. ఒక సినిమాపై ఫోకస్‌గా ఉంటే క్వాలిటీ బాగుంటుంది అనేది కరెక్టే. కానీ కమర్షియల్‌గా ముందుకెళ్లాలంటే ఎక్కువ చిత్రాలు చేయాలి. ఇకపై స్పీడ్ పెంచి, ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. -
మళ్లీ జతగా...!
ఏ హీరో, హీరోయిన్ మధ్య అయినా మంచి కెమిస్ట్రీ కుదిరితే అది సినిమాకి ప్లస్ అవుతుంది. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ అలాంటి జంటే. మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’లో, ఆ మధ్య విడుదలైన ‘ఓకే బంగారం’ చిత్రాల్లో వీళ్ల కెమిస్ట్రీ అదనపు ఆకర్షణ అయ్యింది. ఇప్పుడు ‘ఉస్తాద్ హోటల్’ ద్వారా మరోసారి తెలుగు తెరపై జతగా రానున్నారు. ఈ చిత్రాన్ని ‘జతగా...’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి అనువదించారు. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించడంతో పాటు మూడు జాతీయ అవార్డులు గెల్చుకుందని సురేశ్ కొండేటితెలిపారు. మరిన్ని విశేషాలను ఆయన చెబుతూ - ‘‘ఏ భాషకైనా నప్పే కథ. అందుకే తెలుగులో విడుదల చేస్తున్నాను. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. సాహితి రాసిన సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే, గోపీసుందర్ స్వరపరచిన పాటలు మరో హైలైట్. త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.