సీనియర్ హీరోతో నిత్యామీనన్ | nithya menon to play opposite venkatesh for kishore tirumala film | Sakshi
Sakshi News home page

సీనియర్ హీరోతో నిత్యామీనన్

Published Sat, Sep 10 2016 2:34 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

సీనియర్ హీరోతో నిత్యామీనన్

సీనియర్ హీరోతో నిత్యామీనన్

బాబు బంగారం సినిమాతో సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సాలా ఖద్దూస్ రీమేక్గా తెరకెక్కుతున్న.. గురు(వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న వెంకీ, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఇటీవల బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఓ యువ దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు.

రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కిశోర్ తిరుమల, దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్కు అంగీకరించాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మలయాళి భామ నిత్యామీనన్ను హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించిన నిత్యా, వెంకటేష్తో కలిసి నటిస్తుండటపై ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement