ధనుష్‌ దర్శకత్వంలో నిత్యామీనన్‌ | Dhanush to direct Prakash Raj and Nithya Menen in a new film | Sakshi
Sakshi News home page

ధనుష్‌ దర్శకత్వంలో నిత్యామీనన్‌

Published Wed, Jul 24 2024 11:48 AM | Last Updated on Wed, Jul 24 2024 12:11 PM

Dhanush to direct Prakash Raj and Nithya Menen in a new film

కోలీవుడ్‌లో తుళ్లువదో ఇళమై చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన నటుడు ధనుష్‌. తొలి చిత్రంతోనే విజయాన్ని ఎంజాయ్‌ చేసిన ఈయన ఆ తరువాత పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ నటుడిగా ఎదిగారు. అంతేకాదు తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో నటిస్తూ అరుదైన కథానాయకుడిగా గుర్తింపు పొందారు.

 ఇక నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు అంటే బహుముఖ ప్రతిభావంతుడిగా రాణిస్తున్న ధనుష్‌ 50 చిత్రాల మైలు రాయిని అధిగమించారు. ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం రాయన్‌కు తనే దర్శకత్వం వహించారు. ఇది ఈ నెల 26న తెరపైకి రానుంది. అదే విధంగా ధనుష్‌ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. కాగా ప్రస్తుతం నిలవుక్కు ఎన్న ఎనమేల్‌ కోవం అనే మరో చిత్రాన్నీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం తరువాత 4వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తాజా సమాచారం. 

ఈ విషయాన్ని నటుడు ఎస్‌జే సూర్య ఇక భేటీలో పేర్కొన్నారు. ధనుష్‌ తనకు ఒక కథను చెప్పారని, అది అద్భుతంగా ఉందన్నారు. ఆ కథను ధనుష్‌నే తెరకెక్కించనున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని రాయన్‌ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో నటుడు ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. ఈ చిత్రంలో తనతో పాటు నటి నిత్యామీనన్‌ నటించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఇంతకు ముందు నటుడు ధనుష్‌కు జంటగా నిత్యామీనన్‌ నటించిన తిరుచిట్రఫలం చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement