Masaba Gupta marries Satyadeep Misra in secret ceremony, wedding pics goes viral - Sakshi
Sakshi News home page

Masaba Gupta: నటుడితో డేటింగ్‌.. రెండో పెళ్లి చేసుకున్న నటి

Published Sat, Jan 28 2023 12:50 PM | Last Updated on Sat, Jan 28 2023 1:31 PM

Masaba Gupta Marries Satyadeep Misra in Secret Ceremony, Shares Photos - Sakshi

నటి, ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా సీక్రెట్‌గా పెళ్లిపీటలెక్కింది. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న నటుడు సత్యదీప్‌ మిశ్రాను పెళ్లాడింది. తన సోషల్‌ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్‌ చేసి అభిమాలను సర్‌ప్రైజ్‌ చేసింది. శాంతస్వరూపుడైన సత్యదీప్‌తో నా వివాహం జరిగింది. లెక్కలేనంత ప్రేమ, శాంతి, సంతోషం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ క్యాప్షన్‌ ఎంచుకోవడానికి అనుమతించినందుకు థ్యాంక్స్‌.. ఎందుకంటే ఇది చాలా బాగుంది అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీనికి పెళ్లి ఫోటోలను జత చేసింది. ఇందులో మసాబా లైట్‌ పింక్‌ కలర్‌ కుర్తాలో మెరిసిపోతోంది. ఇక ఈ పోస్టుపై సెలబ్రిటీలు స్పందిస్తూ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విక్కీ కౌశల్‌, సోహా అలీ ఖాన్‌, శిబానీ దండేకర్‌ సహా పలువురు కంగ్రాచ్యులేషన్‌ చెప్తూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా బాలీవుడ్‌ ప్రముఖ నటి నీనా గుప్తా- క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ కూతురే మసాబా. సక్సెస్‌ఫుల్‌ డిజైనర్‌గా కొనసాగుతున్న ఆమె మసాబా 1,2 సీజన్స్‌తో పాటు మోడ్రన్‌ లవ్‌ ముంబై సిరీస్‌లోనూ నటించింది. గతంలో నిర్మాత మధు మంటేనాను పెళ్లాడిన ఆమె 2019లో అతడికి విడాకులు ఇచ్చింది. సత్యదీప్‌ మిశ్రా విషయానికి వస్తే.. అతడు నో వన్‌ కిల్ల్‌డ్‌ జెస్సికా సినిమాతో 2011లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. లా పూర్తి చేసిన అతడు కార్పొరేట్‌ లాయర్‌గానూ పని చేశాడు. ఇటీవలే ఆయన విక్రమ్‌ వేదాలో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌గా, స్పైలో ముక్‌బీర్‌గా నటించాడు. ప్రస్తుతం ఆయన నటించిన తానవ్‌ వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌కు రెడీగా ఉంది. గతంలో ఇతడు హీరోయిన్‌ అదితి రావును పెళ్లాడాడు. కానీ వీరిద్దరి మధ్య పొరపచ్చాలు రావడంతో 2013లో విడిపోయారు.

చదవండి: మాస్‌ మహారాజ రవితేజ ఇల్లు ఎన్ని కోట్లో తెలుసా?
మూడు రోజుల్లో మూడు వందల కోట్లు... షారుక్‌ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement