ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాది విభిన్నమైన వ్యక్తిత్వం. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడించేవారు. నీనా గుప్తా మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేయడం.. మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. కాగా నీనా ఆటో బయోగ్రఫీలోని ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె కూతురు, ఫ్యాషన్ డిజైనర్ మసాబా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
రిచర్డ్స్‌తో విడిపోయాక.. మసాబా జన్మించే సమయానికి తన దగ్గర కేవలం 2000 రూపాయలు మాత్రమే ఉన్నాయని, దీంతో తాను సాధారణ ప్రసవం కోసం చూసినట్లు నీనా తన ఆత్మకథలో రాసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇప్పుడు తాజాగా మసాబా షేర్ చేస్తూ తన తల్లి ఆత్మకథ చదివానని, దానిని నుంచి చాలా విషయాలను నేర్చుకున్నానంటూ భావోద్యేగానికి లోనయ్యింది. బుక్‌లోని ఈ పేజీని షేర్ చేస్తూ.. ‘అమ్మ నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహున్ తో’లో.. మా అమ్మ నాకు జన్మనిచ్చే సమయంలో తన వద్ద కేవలం బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 2 వేలు మాత్రమే ఉన్నాయి.
దీంతో ఆమె సాధారణ డెలివరి కావాలని కోరుకుంది. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ అంటే 10 వేల రూపాయలు కావాలని. లక్కీగా సమయానికి ట్యాక్స్ రీయింబర్స్‌మెంట్ పెరగడంతో తన ఖాతాలో 9 వేలు జమ అయ్యాయి. చివరకు తన డెలివరి సమయానికి బ్యాంకులో 12 వేల రూపాయలు అయ్యాయి. ఇప్పుడు నేను సీ-సెక్షన్ శిశువు. తన ఆత్మకథ చదివి చాలా విషయాలు నేర్చుకున్నాను. తను నన్ను ఈ భూమి మీదకు తీసుకువచ్చేందుకు ఎంతటి కష్టాలు భరించిందో తెలుసుకున్నాను. ఆ సంఘటన నన్ను కలిచివేసింది. అందుకే నా జీవితంలో ప్రతి రోజు.. ప్రతి క్షణం ఆమె రుణం తీర్చుకునేందుకే కష్టపడతాను’ అంటూ మసాబా రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment