Actor Satyadeep Misra Opens Up About His Second Marriage With Masaba Gupta, Deets Inside - Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..

Published Fri, Feb 3 2023 4:07 PM | Last Updated on Fri, Feb 3 2023 4:51 PM

Satyadeep Misra Opens up About His Second Marriage With Masaba Gupta - Sakshi

హీరోయిన్‌ అదితి రావ్‌ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం ఆమె అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ ఆమె హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్‌ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు ఇటీవల యంగ్‌ హీరో శర్వానంద్‌ నిశ్చితార్థంతో సిద్ధార్థ్‌-అదితిలు జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని అంతా ఫిక్స్‌ అయిపోయారు.

అయితే అప్పటికే అదితికి పెళ్లై విడాకులు అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు సత్యదీప్‌ మిశ్రాను గతంలో ఆమె వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. 2009లో వీరి వివాహం జరగ్గా.. 2013లో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఇటీవల ఆమె మాజీ భర్త సత్యదీప్‌ మిశ్రా బాలీవుడ్‌ నటి, ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు సత్యదీప్‌ మిశ్రా. ఈ సందర్భంగా తన మాజీ భార్య అదితిని ఉద్దేశిస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 

చదవండి: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్లు సంపాదించాడో తెలుసా?

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘అదితితో నా రిలేషన్‌ కారణంగా ప్రేమపై నాకు విరక్తి కలిగింది. మరోసారి ప్రేమ, పెళ్లి అంటేనే భయం వేసింది. బ్రేకప్‌ అనుభవం ఎదురైన వాళ్లు మళ్లీ రిలేషన్‌, ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం’ అని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం మసాబాతో  ప్రేమ, రెండో పెళ్లిపై స్పందిస్తూ.. ‘మా పెళ్లి చాలా సింపుల్‌గా జరగాలని అనుకున్నాం. అందుకే కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాం.

తర్వాత ఇండస్ట్రీ వాళ్ల కోసం చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా బంధాన్ని మేం రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఎందుకంటే సీక్రెట్స్‌ అనేవి రిలేషన్స్‌ని ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను. బంధాన్ని సొంతం చేసుకోవాలి.. ఒపెన్‌గా ఉండాలి’ అని పేర్కొంది. ఇక ఆయన సమాధానం విన్న కొందరు నెటిజన్లు ఇది పరోక్షంగా అదితిగా కౌంటర్‌ ఇచ్చాడా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రస్తుతం అదితి సిద్ధార్థ్‌తో సీక్రెట్‌ డేటింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు తమ రిలేషన్‌ని అదితి కానీ, సిద్ధార్థ్‌ కానీ బయట పెట్టలేదు. ఇదిలా ఉంటే మసాబాకు కూడా ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. 

చదవండి: యువత పాశ్చాత్య పోకడలపై కళాతపస్వీ విశ్వనాథ్‌ ఏమన్నారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement