
చిన్న పిల్లలపై లైగింక వేధింపులు జరుగుతున్న ఉదంతాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలా బలపోయిన వారిలో ఎంతో మంది బయటికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. ఇలాంటి వాటికి సెలబ్రిటీలు సైతం అతీతులు కాదు. తాజాగా చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని వెల్లడించింది బాలీవుడ్ నటి నీనా గుప్తా.
సర్దార్ కా గ్రాండ్ సన్, పంగ, సందీప్ ఔర్ పింకీ పరార్, ముల్క్, బదాయిహో వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నీనా గుప్తా. తాజాగా ‘సచ్ కహు తో’ అనే పేరుతో ఆటో బయోగ్రఫీని విడుదల చేసింది. అందులో ఎన్నో వ్యక్తిగత, వృత్తిగత విషయాల గురించి చర్చించింది.
పసి వయస్సులో ఓ డాక్టర్, టైలర్ లైంగికంగా వేధించిన విషయాన్ని అందులో రాసుకొచ్చింది. ‘నా సోదరుడితో కలిసి కళ్ల ఇన్‌ఫెక్షన్‌కు ట్రిట్‌మెంట్ కోసం ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అతను నా బ్రదర్‌ని వెయిటింగ్ రూమ్‌లో ఉండమని చెప్పి.. నా కళ్లను చెక్ చేయడం మొదలుపెట్టాడు. అలా చేస్తూనే కొద్ది సేపు తర్వాత ఇతర పార్ట్‌పై చేయి వేయడం ప్రారంభించాడు.
దీంతో భయంతో వణికిపోయిన నేను ఇంటికి వచ్చి ఎవరికీ తెలియకుండా ఏడ్చాను. అలాగే ఇంకోసారి ఓ టైలర్ దగ్గరికి వెళ్లగా ఇలాగే జరిగింది. ఈ విషయాలను మా అమ్మకు చెప్పలేదు. ఎందుకంటే వాటికి కారణం నేనే అంటుందని. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇలాంటి విషయాలను కచ్చితంగా పెద్దలకు చెప్పేలా పిల్లలను ప్రోత్సాహించాలి’ అని నీనా పేర్కొంది. అంతేకాకుండా ఇలాంటి ఎంతో మంది తన ఫ్రెండ్స్‌తో ఎక్స్‌పీరియన్స్ చేసినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment