అతిథిగా అదితి? | John Abraham to romance Aditi Rao | Sakshi
Sakshi News home page

అతిథిగా అదితి?

Aug 14 2020 6:22 AM | Updated on Aug 14 2020 6:22 AM

John Abraham to romance Aditi Rao - Sakshi

నీనా గుప్తా

అర్జున్‌ కపూర్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా ఓ హిందీ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహాం ఈ చిత్రానికి నిర్మాత. నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బామ్మ, మనవడికి మధ్య నడిచే కథ ఇదని సమాచారం. నీనా గుప్తా బామ్మగా, అర్జున్‌ కపూర్‌ మనవడి పాత్రలో కనిపిస్తారు. ప్రముఖ హీరోయిన్‌ అదితీ రావ్‌ హైదరి అతిథి పాత్రలో మెరవనున్నారని సమాచారం. నీనా గుప్తా యవ్వనంలో ఉన్న పాత్రలో అదితి కనిపిస్తారట. అదితీకి జోడీగా జాన్‌ అబ్రహాం నటించనున్నారట. లాక్‌ డౌన్‌ ముందు చిత్రీకరణ ప్రారంభం అయింది. ఈ నెలాఖరులో మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతారట. ఈ చిత్రానికి కాశవీ నాయర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement