కరీనాకు ఆ పరీక్షలు చేయించలేదు | Kareena didn't undergo sex determination test, says spokesperson | Sakshi
Sakshi News home page

కరీనాకు ఆ పరీక్షలు చేయించలేదు

Published Wed, Jul 13 2016 8:22 PM | Last Updated on Mon, Jul 23 2018 9:11 PM

కరీనాకు ఆ పరీక్షలు చేయించలేదు - Sakshi

కరీనాకు ఆ పరీక్షలు చేయించలేదు

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన గర్భంలో ఉన్న బిడ్డకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించలేదని ఆమె ప్రతినిధి వివరణ ఇచ్చాడు. సైఫ్ అలీఖాన్, కరీనా దంపతులకు మగబిడ్డ జన్మించనున్నాడని, ఇటీవల లండన్ వెళ్లినపుడు లింగనిర్ధారణ పరీక్షలు చేయించారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చాడు.

'మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఊహాజనితం. నిరాధారమైనవి. కరీనా, సైఫ్ వీటిని ఖండించారు. లండన్లో కరీనా, సైఫ్ దంపతులు ఏ డాక్టర్నూ సంప్రదించలేదు. ఇది వ్యక్తిగత విషయం. అనవసరంగా సంచలనం చేయవద్దని అందరినీ కోరుతున్నా' అని కరీనా ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపాడు. కరీనా గర్భవతి అని ఇటీవల సైఫ్ చెప్పాడు. డిసెంబర్లో తమకు తొలిబిడ్డ జన్మించవచ్చని భావిస్తున్నట్టు తెలిపాడు. కాగా సైఫ్కు తొలి భార్య అమృతా సింగ్తో ఇద్దరు పిల్లలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement