
ఓటీటీ 4వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ వేడుక ముంబైలో ఘనంగా జరిగింది.

2024లో డైరెక్ట్‌గా ఓటీటీలో మాత్రమే విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించి ఈ అవార్డ్స్ ప్రకటిస్తారు.

ఉత్తమ నటిగా ఎంపికైన కరీనా కపూర్ ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకుంది.

ఓటీటీలో తన తొలి చిత్రం 'జానే జాన్'కు గాను ఈ అవార్డ్ దక్కింది.

ఒక డిఫరెంట్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ వేడుక కోసం ఆమె ధరించిన చీర చాలా బాగుంది అని నెటిజన్లు ప్రశంసించారు.

ఫోటోలలో ఆమె బేబీ బంప్‌తో ఉన్నట్లు కొందరు గుర్తించి కామెంట్లు చేయడం విశేషం.

ఒక ఫోటోలో ఆమె బంప్ మీద చేతిని ఉంచి స్టిల్ ఇవ్వడంతో అలా కామెంట్ చేసి ఉంటారని కొందరు చెబుతున్నారు.

అయితే, అన్నీ ఫోటోలలో తన బేబీ బంప్ బయటపడకుండా ఒకవైపు మాత్రమే ఫోజులు ఇస్తూ కరీనా జాగ్రత్తలు తీసుకుందని కూడా తెలుపుతున్నారు.

2012లో కరీనాను సైఫ్ అలీఖాన్ వివాహం చేసుకున్నారు.

2016లో వారికి మొదటి సంతానంగా తైమూర్ జన్మించగా 2021లో జెహ్ పుట్టాడు.

ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇదంతా ఫేక్ అంటూ కొందరు తెలుపుతున్నారు.
