
అబ్బ.. ఎంత బాగున్నాడో: కరీనా
పుణెలోని ఎరవాడ జైలు నుంచి శిక్ష ముగించుకుని బయటకు వచ్చిన సంజయ్‌దత్ చాలా అద్భుతంగా ఉన్నాడని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ చెప్పింది. ఆయన బయటకు వచ్చినందుకు తామంతా చాలా సంతోషంగా ఉన్నామని, ఎవరో ఫొటో చూపిస్తే చూశానని, చాలా బాగున్నాడని తెలిపింది. తాను దత్‌కు పెద్ద ఫ్యాన్ అని, వెండితెర మీద మళ్లీ ఎప్పుడు చూస్తానా అని ఆసక్తిగా ఉందని చెప్పింది.
'ఎల్‌ఓసీ కార్గిల్' అనే సినిమాలో కరీనా - సంజయ్‌దత్ కలిసి నటించగా, ఆమె సోదరి కరిష్మా కపూర్ మాత్రం అతడితో కలిసి చాలా సినిమాలు చేసింది. ఆయుధాల చట్టం ఉల్లఘించిన కేసులో సంజయ్‌దత్ శిక్ష అనుభవించాడు. కోర్టు అతడికి ఐదేళ్ల శిక్ష విధించినా, అప్పటికే కొంత శిక్షాకాలం పూర్తి కావడం.. సత్ప్రవర్తన కారణంగా కొంత ముందుగానే గురువారం విడుదలయ్యాడు. బాలీవుడ్ చిత్రపరిశ్రమ సంజయ్‌దత్‌ను సాదరంగా ఆహ్వానించింది.