'ఆ ఇద్దరూ బెస్ట్ గర్ల్‌ఫ్రెండ్స్ కాదు' | None of them was a good girlfriend for Ranbir, says Kareena Kapoor | Sakshi
Sakshi News home page

'ఆ ఇద్దరూ బెస్ట్ గర్ల్‌ఫ్రెండ్స్ కాదు'

Published Sun, Nov 20 2016 10:54 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

'ఆ ఇద్దరూ బెస్ట్ గర్ల్‌ఫ్రెండ్స్ కాదు'

'ఆ ఇద్దరూ బెస్ట్ గర్ల్‌ఫ్రెండ్స్ కాదు'

ముంబై: మనసులో ఉన్నది ఉన్నట్లుగా ఏ భయం లేకుండా చెప్పేసే  ఆర్టిస్టులలో కరీనాకపూర్ ఒకరు. ఆమె ఇటీవల ఓ కార్యక్రమంలో తన సోదరుడు రణబీర్‌కపూర్ వ్యవహారంపై స్పందించింది. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ పై సెటైర్ వేసింది. అసలు విషయం ఏంటంటే.. నో ఫిల్టర్ నేహ కార్యక్రమంలో కరీనాకపూర్ ఖాన్ పాల్గొన్నది. ఆ ఈవెంట్ హెస్ట్ కరీనాను ఓ ప్రశ్న అడిగారు. బాలీవుడ్ నటుడు, సోదరుడు రణబీర్‌ గర్ల్‌ఫ్రెండ్స్ అయిన కత్రినాకైఫ్, దీపికా పదుకొనేలలో ఎవరంటే ఇష్టమని, ఏ కాంభినేషన్ బాగుంటుందని అడిగారు.

ఆ ప్రశ్నపై వెంటనే స్పందించిన కరీనా మాట్లాడుతూ.. ఆ ఇద్దరు హీరోయిన్లలో ఎవరూ తన సోదరుడు రణబీర్‌కు మంచి గర్ల్‌ఫ్రెండ్ కారని పిడుగులాంటి వార్త పేల్చేసింది. కత్రినా, రణబీర్ బ్రేకప్‌ వార్తలు రాకముందు వరకూ కరీనాకు కూడా ఆమె అంటే ఎంతో ఇష్టంగా మెలిగింది. రణబీర్ పేరేంట్స్ కత్రినాతో పెళ్లికి ఒప్పుకోలేదని గతంలో కథనాలు ప్రచారం అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కత్రినా పరిస్థితులకు తగ్గట్లుగా మాట్లాడేస్తుందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రణబీర్‌తో బ్రేకప్ తర్వాత రణవీర్ సింగ్‌తో దీపికా ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement