మా ఆయన మారాలని ఎప్పుడూ కోరుకోలేదు | Bollywood actress Kareena Kapoor Khan, said that she never wants her husband to change. | Sakshi
Sakshi News home page

మా ఆయన మారాలని ఎప్పుడూ కోరుకోలేదు

Dec 5 2015 4:01 PM | Updated on Apr 3 2019 6:23 PM

మా ఆయన మారాలని ఎప్పుడూ కోరుకోలేదు - Sakshi

మా ఆయన మారాలని ఎప్పుడూ కోరుకోలేదు

తన జీవితంలో వివాహం ఎలాంటి మార్పులు తేలేదని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చెబుతోంది.

న్యూఢిల్లీ: తన జీవితంలో వివాహం ఎలాంటి మార్పులు తేలేదని బాలీవుడ్  హీరోయిన్ కరీనా కపూర్ చెబుతోంది.  వైవాహిక జీవితంలో  తామిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని, తమ మధ్య ఎలాంటి  అభిప్రాయ భేదాలు లేకుండా  చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపింది. సైఫ్  అలీఖాన్తో పెళ్లి అనంతరం.. మీ  జీవితంలో ఏవైనా మార్పులు వచ్చాయా అని మీడియా ప్రశ్నించినపుడు ఈ బాలీవుడ్  బ్యూటీ ఇలా స్పందించింది.  

పెళ్ళి చేసుకొని మూడేళ్ళు అవుతున్నా తమ మధ్య చిన్నపాటి సమస్య కూడా తలెత్తలేదని   పెళ్లికి ముందు తన భర్త, సైఫ్ ఎలా వున్నాడో పెళ్లి తర్వాత  కూడా అలాగే ఉన్నాడని చెప్పింది. తన వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను మార్చుకోమని ఎపుడూ  కోరలేదని, భవిష్యత్తులో  కూడా అలా కోరనని కరీనా తెలిపింది.   

హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ సందర్భంగా కరీనా  కపూర్ ఖాన్.. . మీడియాతో తన మనసులోని  భావాలను ఇలా వ్యక్తం చేసింది. 'మా ఆయన మారాలని నేను  ఎపుడూ కోరుకోలేదు...కోరను కూడా.. నేను తనని ఇష్టపడి పెళ్లి  చేసుకున్నాను. పెళ్లి నా జీవితంలో మార్పులు తేవాలని అనుకోలేదు. నేను కూడా పెళ్లికి ముందు ఎలా వున్నానో ఇపుడూ అలాగే ఉన్నాను.. ఉంటాను   కూడా... అంటూ  వైవాహితక జీవితం గురించి  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తన భర్తకు ఏ రోజూ ...  ఎలాంటి షరతులు పెట్టలేదని, తనని సాధ్యమైనంత వరకు అర్ధం చేసుకోడానికే ప్రయత్నిస్తానని ఈ అమ్మడు పేర్కొంది. ఈ మూడేళ్ళలో సైఫ్ లో ఎలాంటి మార్పులు తను చూడలేదని, పెళ్లికి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని పేర్కొంది.  భవిష్యత్ లో కూడా ఆ అవసరం రాకుండా చూసుకుంటానంటూ కరీనా వెల్లడించింది . కాగా  కపూర్ కుటుంబం నుంచి  వచ్చిన కరీనా 2012 లో  బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్లాడిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement