
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. సినిమా ప్రకంటించిన సమయంలో సల్మాన్ కు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రియాంక కూడా హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసుకొని భరత్ షూటింగ్ కోసం ఇండియాకు తిరిగి వచ్చారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ప్రియాంక చోప్రా తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలుగా ప్రియాంక తప్పుకోవటంతో మరో హీరోయిన్‌కోసం వేట ప్రారంభించారు చిత్రయూనిట్. ముందుగా సల్మాన్‌తో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని భావించినా.. క్యారెక్టర్ పరంగా కరీనా అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించకపోయినా.. కరీనానే ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment