ప్రియాంక అవుట్‌.. వెరీ స్పెషల్‌ | Priyanka Chopra Engaged Nick Jonas Viral | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 27 2018 1:53 PM | Last Updated on Fri, Jul 27 2018 1:55 PM

Priyanka Chopra Engaged Nick Jonas Viral - Sakshi

నటి ప్రియాంక చోప్రా(36) గత కొంత కాలంగా బాలీవుడ్‌ చిత్రాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె సల్మాన్‌ ఖాన్‌ భరత్‌ చిత్రంలో నటిస్తుండటంతో ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీలయ్యారు. కొన్ని రోజులపాటు షూటింగ్‌లో పాల్గొన్న ఆమె.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి అర్థాంతరంగా తప్పుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్త నిజమేనన్న విషయాన్ని ధృవీకరిస్తూ భరత్‌ డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ జఫర్‌ ఓ ట్వీట్‌ చేశారు. 

‘అవును.. ప్రియాంక చోప్రా  ఇక భరత్‌ చిత్రంలో భాగస్వామి కాదు. అందుకు వెరీ స్పెషల్‌ కారణం ఉంది అంటూ నిక్‌, ప్రియాంకల పేరును ప్రస్తావిస్తూ పరోక్షంగా ఓ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఆమె ఎల్లప్పుడూ ప్రేమతో  సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ భరత్‌ టీం తరపున జఫర్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో ఈ డైరెక్టర్‌ పెద్ద హింటే ఇచ్చాడని బాలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారన్న కథనాలు బాలీవుడ్‌లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు అమెరికా మీడియా సైతం వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందంటూ వార్తలు ప్రచారం చేస్తున్నాయి.

తనకన్నా వయసులో చిన్నవాడైన అమెరికన్‌ నటుడు నిక్‌ జోనాస్‌(25)తో ప్రియాంక చోప్రా గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్‌ తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. కూడా జోన్స్‌ను తీసుకురావటం, వారిద్దరు ఎక్కడపడితే కెమెరా కళ్లకు చిక్కటంతో రకరకాల కథనాలు వినిపించాయి. ఇరు కుటుంబాలు ఒప్పుకోవటంతో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని, త్వరలో వీరిద్దరూ వివాహానికి సిద్ధమయ్యారన్న వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement