‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’ | Salman Khan Said I Want Children But I Do Not Want The Mother | Sakshi
Sakshi News home page

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సల్మాన్‌

Published Wed, May 22 2019 12:10 PM | Last Updated on Wed, May 22 2019 12:14 PM

Salman Khan Said I Want Children But I Do Not Want The Mother - Sakshi

బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు సల్మాన్‌ ఖాన్‌. 53 ఏళ్ల వయసులో ఉన్నా సల్మాన్‌ పెళ్లి వార్తలు ఇప్పటికీ బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి. గత ఏడాది కూడా రొమేనియన్‌ బ్యూటీ లూలియాను, సల్మాన్‌ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. తర్వాత ఆ ఊసు లేదు. ఈ క్రమంలో మరోసారి సల్మాన్‌ పెళ్లి ప్రస్తావన వచ్చింది. ముంబై మిర్రర్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్‌ను పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పారు సల్మాన్‌. ‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ వారితో పాటు తల్లి కూడా వస్తుంది. నాకు తల్లి వద్దు.. పిల్లలు మాత్రమే కావాలి. వారిని భద్రంగా చూసుకోవడం కోసం ఓ గ్రామాన్నే సిద్ధం చేసి ఉంచాను’ అన్నారు సల్మాన్‌.

మరి పెళ్లి అంటే.. దానికి ఇంకాస్త టైం ఉందని తెలిపారు సల్మాన్‌. ఈ ఇంటర్వ్యూ తర్వాత సల్మాన్‌ సరోగసికి సిద్ధమవుతున్నారనే వార్తల ప్రచారం ఎక్కువయ్యింది. తన స్నేహితులు షారూఖ్‌, ఆమిర్‌ బాటలోనే సల్మాన్‌ వెళ్తున్నారని.. సరోగసి విధానం ద్వారా ఆయన తండ్రి అవుతాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సల్మాన్‌ ‘భారత్‌’ ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. రంజాన్‌ సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా కోసం తొలుత ప్రియాంక చోప్రాను తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ నిక్‌ జోనాస్‌తో వివాహం నేపథ్యంలో ప్రియాంక ఈ చిత్రం నుంచి తప్పుకుంది. తర్వాత ఆమె స్థానంలో కత్రినా వచ్చారు. అయితే ఈ విషయంలో ఇప్పటికి కూడా ప్రియాంక మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సల్మాన్‌. భారత్‌ ప్రమోషన్‌లో భాగంగా మరోసారి ప్రియాంకను విమర్శించారు సల్మాన్‌. ఈ చిత్రం కోసం ఎందరో తమ భర్తలకు దూరంగా ఉండి పని చేస్తే.. ప్రియాంక మాత్రం తన భర్త కోసం ఈ సినిమాను వదులుకుందని సల్మాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement